జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 27, 2024
- 1 min read
Updated: Feb 28, 2024

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న జై భారత్ నేషనల్ పార్టీ
విజయవాడ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రతినిధులు నినదించారు. మార్చి1న సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి జైభారత్ నేషనల్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రవికిరణ్, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ మెన్ ఆకురాతి వెంకట అశ్విని, లీగల్ ప్రతినిధురాలు బి.వి.అరుణ, మల్లేశ్వరి తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో రవికిరణ్ మాట్టాడుతూ, యువతకు ఉపాధి కోసం ప్రత్యేక హోదా తప్పనిసరి అని జైభారత్ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ మలి విడత ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలంటే, పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావాలని, దీనికి సంబంధించిన రాయితీలన్నీ ప్రత్యేక హోదాతో సాధ్యం అవుతుందన్నారు. అభివృద్ధిలో అణగారిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు. ప్రత్యేకహోదా సాధన విద్యార్థి, యువజన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మార్చి 1న నిర్వహించే కార్యాచరణకు తాము సిద్ధమని తెలిపారు.
Comments