జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ అధ్యక్షుడు శ్రీ వి. వి.లక్ష్మి నారాయణకి బ్రహ్మశ్రీ చాగంటి ఆశీస్సులు.
- Jai Bharat National Party
- Feb 3, 2024
- 1 min read

- జైభారత్ పార్టీ మేనిఫెస్టోను సమర్పించిన జేడీ
- ఉన్నత ఆశయాలతో విజయం సాధించాలని చాగంటి ఆశీర్వాదం
విజయవాడ\కాకినాడ:
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గురువారం కలిశారు. ఆయనకు పాదాభివందనం చేసిన లక్ష్మీనారాయణ, పార్టీ మ్యానిఫెస్టోను చాగంటికి అందజేశారు. ఆయన పక్కన కూర్చుని జైభారత్ మ్యానిఫెస్టోలోని అంశాలను స్వయంగా చదివి వినిపించారు. అన్ని విషయాలను శ్రద్ధగా విన్న చాగంటి కోటేశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ ఉన్నత ఆశయాలను కొనియాడారు. జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న జైభారత్, ఉన్నత రాజకీయ విలువలతో ముందుకు సాగాలని చాగంటి ఆశీర్వదించారు.
Comments