top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Mar 6, 2024
  • 1 min read


జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ నెల్లూరు ముని లక్ష్మీ గారి మీద నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం చాలా దురదృష్టకరం సమాజానికి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మహిళ మీద ఇలాంటి దాడి చేయడం ఇది మరింతగా దిగజారిపోయినటువంటి పరిస్థితులుగా కనబడుతుంది. ఇలాంటి దాడిని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుల నుండి కిందిస్థాయి కార్యకర్తల వరకు అందరం వీటిని ఖండిస్తున్నాము. శ్రీ కాళహస్తి కోఆర్డినేటర్ నిరంజన్ రెడ్డి గారు, సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ వెల్లూరు కిరణ్ గారు, నగిరి నియోజకవర్గం కోఆర్డినేటర్ షిర్డి సాయి రామ్ గట్టు గారు ఈరోజు మధ్యాహ్నం మేడమ్ గారిని కలిసి పరామర్శించడం జరిగింది. అలాగే మేడం గారికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి వాటిని మేమందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాలని వారికి కూడా ప్రేమ పూర్వకంగా హెచ్చరికలు తెలియజేస్తున్నాము.

జై భారత్ నేషనల్ పార్టీ,

జై శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు.

 
 
 

Comments


bottom of page